మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 03, 2020 , 19:07:45

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం చొర‌వ తీసుకోండి

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం చొర‌వ తీసుకోండి

హైదరాబాద్ : కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం చొర‌వ తీసుకోవాల‌ని కోరుతూ, ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ మంత్రి కేటీఆర్ ను ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా ప్రజా ప్రతినిధులు కోరారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్కర్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీ‌నివాస్రెడ్డి, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్ ఈ మేర‌కు కేటీఆర్ ని ప్రగతి భ‌వ‌న్ లో క‌లిశారు. ఈ సంద‌ర్భంగా కాజీపేట రైల్వే కోచ్ వ‌రంగ‌ల్ ప్రజల చిర‌కాల వాంఛ అని, అనేక పోరాటాలు చేసినా మంజూరు కావడం లేద‌న్నారు. అందుకు అవ‌స‌ర‌మైన భూమిని కూడా సిద్ధం చేశామ‌ని వారు కేటీఆర్ కి వివ‌రించారు. 

కేంద్రంతో మాట్లాడి, అవ‌స‌ర‌మైన చ‌ర్యలు తీసుకోవాల‌ని, కాజీపేట‌లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ఇక్కడి యువ‌త‌కు ఉపాధి ల‌భిస్తుంద‌న్నారు. ఈ ప్రాంతానికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యాత ఏర్పడుతుందని వివరించారు. ఈ మేర‌కు ఓ విన‌తి ప‌త్రాన్ని మంత్రికి అంద‌జేశారు. 


logo