శనివారం 06 జూన్ 2020
Telangana - May 13, 2020 , 00:47:35

పింఛన్‌ డబ్బుల కోసం ప్రాణం తీసిండు..

పింఛన్‌ డబ్బుల కోసం ప్రాణం తీసిండు..

  • రోకలిబండతో తండ్రిపై దాడిచేసిన తనయుడు 

కట్టంగూర్‌: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి పింఛన్‌ డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కన్నతండ్రి ప్రాణాలు తీశాడు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా కట్టంగూర్‌ మండలం కురుమర్తికి చెందిన నూకల భిక్షం మద్యానికి బానిసై ఆరేండ్ల కిందట భార్యపై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లగా తండ్రి గంగయ్య(70)తో కలిసి ఉంటున్నా డు. ఈ క్రమంలో ఈనెల 11న సాయం త్రం తండ్రి వద్ద ఉన్న పింఛన్‌ డబ్బులు ఇవ్వాలని భిక్షం గొడవపడ్డాడు. తండ్రి ఇవ్వక పోవడంతో రోకలిబండతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ గంగయ్యను ఇరుగుపొరుగు వారు నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు. భిక్షం భార్య సైదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై ప్రసాద్‌ తెలిపారు.


logo