శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 01, 2020 , 01:36:16

రాజ్‌న్యూస్‌పై చర్యలు తీసుకోండి: టీఆర్‌ఎస్‌

రాజ్‌న్యూస్‌పై చర్యలు తీసుకోండి: టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు ప్రసారంచేస్తున్న రాజ్‌న్యూస్‌ చానల్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఆ చానల్‌పై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్‌ సోమవారం ఎన్నికల కమిషనర్‌ పార్థసారథికి వినతిపత్రం అందజేశారు. అనంతరం భరత్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రచారకర్తగా మారిన రాజ్‌న్యూస్‌ చానెల్‌పై కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. ప్రచారం గడువు ముగిశాక ఈ చానెల్‌ ద్వారా బీజేపీ ప్రచారం చేయిస్తున్నదని ఆరోపించారు. కొందరికి పైసలు ఇచ్చి మాట్లాడిస్తూ, తిట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీని కోరామని తెలిపారు.


logo