శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 02:45:50

పైసల కోసం అక్రమార్కులకు పట్టాలు

పైసల కోసం అక్రమార్కులకు పట్టాలు

  • ములుగు జిల్లాలో తాసిల్దార్‌, మరోఐదుగురు రెవెన్యూ ఉద్యోగుల సస్పెన్షన్‌

ములుగు: ప్రభుత్వ భూమిని ఇష్టానుసారం పంచిన తాసిల్దార్‌తో పాటు ఐదుగురు రెవెన్యూ ఉద్యోగులను ములుగు జిల్లా కలెక్టర్‌ కృష్ణఆదిత్య సస్పెండ్‌ చేశారు. ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలోని సర్వే నంబర్‌ 134, 253, 254లో మొత్తం 884 ఎకరాల అసైన్డ్‌ భూమి ఉంది. లంచాలకు ఆశపడ్డ వెంకటాపూర్‌ తాసిల్దార్‌ సహా మరో ఐదుగురు రెవెన్యూ ఉద్యోగులు అక్రమార్కులకు పట్టాలు చేశారు. దీనిపై విచారణ జరిపించిన జిల్లా కలెక్టర్‌.. వెంకటాపూర్‌ తాసిల్దార్‌ కిశోర్‌కుమార్‌, నాయబ్‌ తాసిల్దార్‌ రాజునాయక్‌, ఆర్‌ఐ పోరిక సునీల్‌కుమార్‌, వీఆర్వోలు యు మల్లేశ్‌, వీ శంకర్‌తోపాటు వీఆర్‌ఏ జీ తిరుపతిరాజును సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 


logo