ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 24, 2020 , 01:24:25

నేటినుంచి టీ-సాట్‌ ప్రత్యేక పాఠాలు

నేటినుంచి టీ-సాట్‌ ప్రత్యేక పాఠాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఎంసెట్‌, నీట్‌, ఐఐటీ మెయిన్స్‌ విద్యార్థుల కోసం మంగళవారం నుంచి మే మూడోతేదీ వరకు టీ-సాట్‌ నెట్‌వర్క్‌ చానళ్లలో ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రసారంచేయనున్నట్టు టీ-సాట్‌ సీఈవో ఆర్‌ శైలేశ్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మ్యాథ్స్‌ 1 అండ్‌ 2, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టుల అధ్యాపకులు బోధించిన పాఠ్యాంశాలను 43 రోజులపాటు 500 ఎపిసోడ్లుగా ప్రసారంచేస్తామని పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు నిపుణ చానల్‌లో, ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 12 గంటల వరకు విద్యాచానల్‌లో పాఠాలు ప్రసారం కానున్నాయని ఆయన వెల్లడించారు. నిత్యం 11 గంటలపాటు ప్రసారాలు కొనసాగుతాయని తెలిపారు. 


logo