గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 09, 2020 , 02:56:50

నేటినుంచి టీన్యూస్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌

నేటినుంచి టీన్యూస్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: టీ న్యూస్‌ చానల్‌, అపెక్స్‌ సంస్థల ఆధ్వర్యంలో హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లోని కమ్మ సంఘం కార్యాలయంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు తెలంగాణ గోల్డెన్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ -2020 నిర్వహించనున్నారు. మూడురోజులు జరిగే ఈ ఫెయిర్‌ను శుక్రవారం ఉదయం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రారంభిస్తారు. ఇంజినీరింగ్‌, ఫార్మసీ కాలేజీల్లో ఏయే కోర్సులున్నాయి? ఏ ర్యాంకువారికి ఏ కాలేజీలో, ఏ కోర్సులో సీటు వచ్చే అవకాశాలు ఉంటాయి? ఫీజులు వంటి పూర్తివివరాలు ఈ ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించనున్నట్లు నిర్వాహకులు గురువారం తెలిపారు.


logo