సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 09:50:38

టీ హబ్‌తో జతకట్టిన హిరోషిమా

టీ హబ్‌తో జతకట్టిన హిరోషిమా

హైదరాబాద్: నూతన ఆవిష్కరణలు, కొత్త వ్యాపార నమూనాలు రూపొందించడంలో కలిసి పనిచేసేందుకు టీ హబ్‌, జపాన్‌లోని హిరోషిమా స్థానిక ప్రభుత్వం జతకట్టాయి. ఇరు ప్రాంతాల మధ్య స్టార్టప్‌ ఎకోసిస్టంను బలపర్చుకునేందుకు పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. వినియోగదారుల అనుభవాలు పంచుకోవడానికి, డిజిటల్‌ పరివర్తనను ప్రోత్సహించడానికి ఇది దోహదపడనున్నది. ఈ భాగస్వ్యామంలో మొదటి అడుగుగా టీ హబ్‌ ‘రోడ్‌ టు షైన్‌' (ఆర్‌2ఎస్‌) కార్యక్రమానికి ఇండో జపనీస్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ కన్సల్టెన్సీ సంస్థ అయిన ఇన్ఫోబ్రిడ్జ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి నాయకత్వం వహించనున్నది.logo