శనివారం 06 జూన్ 2020
Telangana - May 09, 2020 , 18:27:28

కరీంనగర్‌లో టీ-కన్సల్ట్‌ సేవల్ని ప్రారంభించిన మంత్రి ఈటెల

కరీంనగర్‌లో టీ-కన్సల్ట్‌ సేవల్ని ప్రారంభించిన మంత్రి ఈటెల

 హైదరాబాద్‌:  లాక్‌డౌన్‌ సమయంలో  ప్రజలు మెరుగైన వైద్యసేవలు పొందేందుకు టీ-కన్సల్ట్‌ యాప్‌ తెలంగాణలో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కరీంనగర్‌లో టీ-కన్సల్ట్‌ టెలీమెడిసిన్‌ ప్రాజెక్టును మంత్రి ఈటెల రాజేందర్‌ శుక్రవారం ఆవిష్కరించారు. వీడియో లింక్‌ ద్వారా  ఆన్‌లైన్‌ విధానంలో  వైద్యసేవలు అందిస్తున్నారు. కరీంనగర్‌ జిల్లాలోని జమ్మికుంట నుంచి జిల్లా వ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనున్నారు.  టీటా (తెలంగాణ సమాచార సాంకేతిక సంఘం) ఆధ్వర్యంలో ఈ సేవలను నిర్వహిస్తున్నారు.  వైద్య నిపుణులు, రోగులు, స్థానిక ఫార్మసీ దుకాణాలను అనుసంధానించే కీలక వేదికగా యాప్‌ పనిచేస్తుంది. 

టెలిమెడిసిన్‌ సేవలు ఇలా..

ఆన్‌లైన్‌ విధానం ద్వారా స్పెషలైజ్డ్‌ డాక్టర్‌ తమ అందుబాటు సమయం పేర్కొంటారు. ప్రజల అపాయింట్‌మెంట్‌ పొందుతారు. సంబంధిత డాక్టర్‌, గ్రామస్థుడు ఆన్‌లైన్‌ ద్వారా కన్సల్ట్‌ అవుతారు. వీరిద్దరి మధ్య జరిగిన టెలిమెడిసిన్‌ ప్రక్రియ అనంతరం ప్రిస్క్రిప్షన్‌ సైతం ఆన్‌లైన్‌లో చేరుతుంది. గ్రామపంచాయతీ కార్యాలయంలో నోడల్‌ ఆఫీసర్‌ ఈ వీడియో కనెక్ట్‌ ప్రక్రియను సమన్వయం చేస్తారు. లాక్‌డౌన్‌లో మెరుగైన వైద్యసేవలు ఈ ప్రాజెక్టు ద్వారా అందనున్నాయి. 


logo