మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 03, 2020 , 19:39:40

‘బీటీపీఎస్‌ యూనిట్‌-2లో సింక్రనైజేషన్‌ సక్సెస్‌’

‘బీటీపీఎస్‌ యూనిట్‌-2లో సింక్రనైజేషన్‌ సక్సెస్‌’

హైదరాబాద్ : సమిష్టి కృషితోనే యూనిట్‌-2 సింక్రనైజేషన్‌ విజయవంత మైందని ఇదే స్ఫూర్తితో అన్ని యూనిట్‌ల నుంచి పూర్తి స్థాయి విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని విద్యత్‌ శాఖ మంత్రి జి. జగదీశ్వరరెడ్డి అన్నారు. ఆయన హైదరాబాద్‌ విద్యుత్‌ సౌధ నుంచి జెన్‌కో అండ్‌ ట్రాన్స్‌కో సీంఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో కలిసి మణుగూరు, పినపాక మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 1080(270x 4)మెగావాట్ల సామర్థ్యం గల భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో యూనిట్‌-2 సింక్రనైజేషన్‌ను ఆన్‌లైన్‌లో రిమోట్‌ ద్వారా స్విచ్‌ అన్‌చేసి  ప్రారంభించారు. 

ఈ ప్రక్రియ ద్వారా 20 మోగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అయింది. అధికారులు ఈ విద్యుత్‌ను గ్రిడ్‌కు అను సంధానం చేశారు. అనంతరం మంత్రి రెండో యూనిట్‌ సింక్రనైజేషన్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు జెన్‌కో, భెల్‌ అధికారులకు అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి మిగతా రెండు యూనిట్లనూ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. భద్రాద్రి విద్యుత్‌ అవసరం రాష్ర్టానికి ఎంతో ఉంటుందన్నారు. కార్యక్రమంలో జెన్‌కో డైరెక్టర్‌ (ప్రాజెక్టు) ఎం.సచ్చితానందం, బీటీపీఎస్‌ సీఈ పిల్లి బాలరాజు, సీఈ (టీపిసీ) పీవీ శ్రీనివాస్‌, బీహెచ్‌ఈఎల్‌ జనరల్‌ మేనేజర్‌ అగర్వాల్‌, డీజీఎం రంజిత్‌ పాల్‌, జెన్‌కో ఎస్‌ఈ, మహేందర్‌, జెన్‌కో, బీహెచ్‌ఈఎల్‌ ఇంజినీర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


logo