సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 16:22:26

పచ్చదనానికి ప్రతీక శంషాబాద్ విమానాశ్రయం : ఎంపీ సంతోష్‌ కుమార్

పచ్చదనానికి ప్రతీక శంషాబాద్ విమానాశ్రయం : ఎంపీ సంతోష్‌ కుమార్

హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా జీఎమ్మార్, సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సీఐఎస్ఎఫ్ (CISF) అధికారులు, భద్రత విభాగం సిబ్బందితో కలిసి ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంతోష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శంషాబాద్ విమానాశ్రయంలో పచ్చదనానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారన్నారు.

మేము పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీకి వెళ్లి వచ్చినప్పుడు,  ఇతర సందర్భాల్లో ఎయిర్ పోర్ట్ కు వచ్చినప్పుడు  ప్రతి సందర్భంలో శంషాబాద్ విమానాశ్రయం అందాలను చూస్తూ ఉంటే చాలా ఆనందం కలుగుతుందన్నారు. ఇక్కడ ఉన్న పచ్చదనం దేశంలోని ఏ విమానాశ్రయంలో కూడా లేదని కొనియాడారు. పచ్చదనాన్ని పెంచడం కోసం ఈరోజు జీఎంఆర్ సంస్థ, సీఐఎస్ఎఫ్ సిబ్బంది కలిసి ఇంత పెద్ద ఎత్తున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.

 ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న సంతోష్ కుమార్ ను జీఎంఆర్, సీఐఎస్ఎఫ్ సిబ్బంది సత్కరించారు. కార్యక్రమంలో ప్రదీప్ పణికరు సీఈవో జీఎమ్మార్ హైదరాబాద్ విమానాశ్రయం, మదన్ కుమార్ సింగ్ డీఐజీ సీఐఎస్ఎఫ్, భరత్ కుమార్ విమానాశ్రయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.logo