గురువారం 02 జూలై 2020
Telangana - Jun 30, 2020 , 15:51:48

నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం

నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ  ప్రమాణ స్వీకారం

నిర్మల్ : జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. స్థానిక  వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి సమక్షంలో చైర్మన్ గా కొంగరి నర్మదా ముత్యం రెడ్డి, వైస్ చైర్మన్ గా తోట సురేందర్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం డైరెక్టర్లు అబ్దుల్ వకీల్, పిసరి శైలేశ్వర్, ఎన్.లక్ష్మారెడ్డి, బరుకుంట గంగారాం, రాథోడ్ సురేష్, మలోత్ కిమియా నాయక్, మంత్రి రాజగోపాల్, కొమ్ము గంగాధర్  ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శాలువా పూలమొక్కతో సత్కరించారు.


logo