శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 25, 2020 , 02:14:30

స్వైన్‌ఫ్లూతో బాలింత మృతి

స్వైన్‌ఫ్లూతో బాలింత మృతి
  • జన్మనిచ్చిన మగబిడ్డ క్షేమం

బన్సీలాల్‌పేట్‌/భూపాలపల్లి టౌన్‌: స్వైన్‌ఫ్లూ తో గాంధీ దవాఖానాలో చేరిన ఓ గర్భిణి, మగబిడ్డకు జన్మనిచ్చి తాను కన్నుమూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఎల్బీనగర్‌కు చెందిన ఎండీ వలీ కుమార్తె షాహనాజ్‌(30)ను కరీంనగర్‌ జిల్లా జిమ్మికుంట మండలం బిజిగిరికి చెందిన హబీబ్‌కిచ్చి వివాహం చేశారు. షాహనాజ్‌ నిండుగర్భిణి కావడంతో ఇటీవల ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను భూపాలపల్లిలోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు ఆమెకు స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నట్టు నిర్ధారించి గాంధీ దవాఖానకు తీసుకెళ్లాలని సూచించారు. కుటుంబసభ్యులు షాహనాజ్‌ను ఈ నెల 18న గాంధీదవాఖానలో చేర్పించారు. గాంధీ వైద్యులు ఆమెకు స్వైన్‌ఫ్లూ పరీక్షలు నిర్వహిస్తుండగా.. 19న నొప్పులు వచ్చాయి. దీంతో సిజేరియన్‌ చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబును పరీక్షించగా స్వైన్‌ఫ్లూ లేదని తేలింది. దీంతో బాధితురాలకి అప్పటినుంచి స్వైన్‌ఫ్లూ ప్రత్యేకవార్డులో చికిత్స నందిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యపరిస్థితి విషమించి సోమవారం ఉదయం మృతిచెందింది. 


logo