శనివారం 06 జూన్ 2020
Telangana - May 02, 2020 , 22:26:55

ప్రాణం తీసిన ఈత సరదా..

ప్రాణం తీసిన ఈత సరదా..

ధర్మపురి ‌: ఈత సరదా ఓ యుకుడి ప్రాణం తీసింది. ధర్మపురి మండలం తీగలధర్మారం గ్రామానికి చెందిన ఎమ్డీ షాజాహాన్‌(18)అనే మువకుడు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడని ఎస్‌ శ్రీకాంత్‌ తెలపారు. షాజహాన్‌ మధ్యాహ్నం స్నేహితులతో కలిసి సరదాగా గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ బావి వద్దకు ఈత కోసం వెళ్లాడు. బావిలోకి దూకి ఈత వచ్చినా కొట్టలేని స్థితిలో నీటమునిగి మృతి చెందినట్లు ఎస్‌ఐ వెల్లడించారు. షాజహాన్‌ ధర్మపురిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పూర్తిచేశాడు.  తండ్రి రహమతుల్లా పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ పేర్కొన్నారు.logo