ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 14, 2020 , 16:35:53

యాదాద్రిలో ఘనంగా స్వాతినక్షత్ర పూజలు

యాదాద్రిలో ఘనంగా స్వాతినక్షత్ర పూజలు

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం స్వాతినక్షత పూజలను ఘనంగా నిర్వహించారు.  బాలాలయంలో ఉత్సవమూర్తులను ఆరాధిస్తూ వేదమంత్రాల మధ్య అష్టోత్తర శతఘటాభిషేకం చేపట్టారు. 108 కలశాలకు పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. స్వామివారి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా వేకువజామున బాలాలయంలో ఉత్సవమూర్తులకు అభిషేకం చేసి ప్రత్యేక హారతి నివేదించారు. తొలుత కలశాల పూజ జరిపి నారీకేళ తీర్థంతో ఉత్సవమూర్తులను అభిషేకించారు. సుమారు రెండుగంటలపాటు స్వామివారికి అభిషేకం కొనసాగింది. పలువురు భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.