గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 10, 2020 , 21:24:13

పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం..అధికారులపై వేటు

పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం..అధికారులపై వేటు

రాజన్నసిరిసిల్ల: విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై వేటు పడింది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమంలో క్షేత్ర స్థాయిలో పని చేయని సిబ్బందిపై వేటు వేస్తూ కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. పల్లె ప్రగతి పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించిన బోయినపల్లి మండల పరిషత్ ఏఈఈ ఇనయతుల్లాను సస్పెండ్ చేశారు. అదేవిధంగా గ్రామాల్లో స్మశానవాటికల నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన ఎల్లారెడ్డిపేట, వేములవాడ మండలాల డీఈఈలు, కోనరావుపేట, ఇల్లంతకుంట మండలాల ఏఈఈలు, ముస్తాబాద్, వేములవాడ, చందుర్తి, రుద్రంగి మండలాల ఏఈలకు మోమోలు జారీ చేస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. logo