ఆదివారం 07 జూన్ 2020
Telangana - Apr 03, 2020 , 01:01:55

కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు

కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు

-వ్యక్తిపై దురుసుప్రవర్తన

-మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో చర్యలు

వనపర్తి టౌన్‌: నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు కొడుకుతో కలిసి వెళ్తున్న ఓ వ్యక్తితో దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటుపడింది. వనపర్తికి చెందిన మురళి తన కొడుకుతో కలిసి బుధవారం సాయంత్రం బైక్‌పై కొత్తబస్టాండ్‌కు వచ్చారు. విధుల్లో ఉన్న పోలీసులు వాహనాన్ని సీజ్‌ చేస్తున్నట్టు చెప్పారు. మురళి బతిమాలాడుతుండగా ఆవేశానికి గురైన కానిస్టేబుల్‌ అశోక్‌ అతడిని విచక్షణారహితంగా కొట్టాడు. అనంతరం మురళి, అతని కొడుకును స్టేషన్‌కు తరలించారు. ఓ వ్యక్తి ఈ ఘటన వీడియోను మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు. మంత్రి కేటీఆర్‌ సూచన మేరకు వనపర్తి ఎస్పీ అపూర్వరావు సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.  అనంతరం ఆమె మురళి కొడుకుని కలిసి మాట్లాడారు.


logo