మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 12:05:25

భార్య,భర్తలైన ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

భార్య,భర్తలైన ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

మంచిర్యాల:  మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న భార్య,భర్తలైన ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసు అధికారులు సస్పెండ్‌ చేశారు. సిక్‌ లీవ్‌ విషయంలో సీఐ సంతకం ఫోర్జరీ చేసినందుకు గాను కానిస్టేబుల్‌ వై.జయచంద్ర, మహిళా పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎం.వనితను రామగుండం పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ సస్పెండ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

కమిషనరేట్‌ పరిధిలో పనిచేసే అధికారులు, సిబ్బంది క్రమశిక్షణరాహిత్యం, విధుల్లో నిర్లక్ష్యం, పోలీస్‌ వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగేవిధంగా ఎవరూ ప్రవర్తించిన ఉపేక్షించేది లేదని ఆయన తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై శాఖ పరమైన కఠినచర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo