సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Sep 22, 2020 , 12:40:34

భారీ చోరీని ఛేదించిన సూర్యాపేట పోలీసులు

భారీ చోరీని ఛేదించిన సూర్యాపేట పోలీసులు

సూర్యాపేట : జిల్లాలోని మట్టంపల్లి మండలం పెద్దవీడు గ్రామంలో జులై 27 న ఓ కరోనా పేషేంట్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. దీనిపై అప్పట్లోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పలు ఆధారాలు సేకరించాక చోరీకి సంబంధించిన నలుగురు నిందితులను మంగళవారం హుజుర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు విషయాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ భాస్కరన్ మీడియాకు వెల్లడించారు.

నిందితుల వద్ద నుంచి 60 తులాల బంగారం, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ. 30 లక్షలు ఉంటుందని ఎస్పీ వివరించారు. నిందితులను పట్టుకొని బంగారం రికవరీ చేసిన కోదాడ డీఎస్పీ రఘు, సీఐ రాఘవరావు, ఎస్.ఐ విష్ణు, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.


logo