మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 03:31:52

‘కాళేశ్వరం’తో సూర్యాపేట సస్యశ్యామలం

‘కాళేశ్వరం’తో సూర్యాపేట సస్యశ్యామలం

  • రైతులతో ముఖాముఖిలో మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట, నమస్తేతెలంగాణ: కాళేశ్వరం జలాలతో సూర్యాపేట జిల్లా సస్యశ్యామలంగా మారిందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండల కేంద్రంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి వేడుకల్లో మంత్రి పాల్గొని నాగలి పట్టి దున్నారు. ఏకకాలంలో 150 మంది రైతులతో ఏరువాక సాగింది. అనంతరం గ్రామంలో నియంత్రిత సాగుపై రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న నియంత్రిత సాగు పంటల విధానం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుందని తెలిపారు.  కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపిక పాల్గొన్నారు. 


logo