శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 07, 2020 , 14:41:47

మొక్క‌లు నాటిన సూర్యాపేట ఎస్పీ

మొక్క‌లు నాటిన సూర్యాపేట ఎస్పీ

సూర్యాపేట : గ‌్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీక‌రించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్‌. భాస్క‌ర‌న్ నేడు మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా మ‌రో ముగ్గురికి ఆయ‌న గ్రీన్ ఛాలెంజ్‌ను విసిరారు. ములుగు ఎస్పీ సంగ్రాంసింగ్ పాటిల్‌, సూర్యాపేట క‌లెక్ట‌ర్ విన‌య్ కృష్ణారెడ్డి, మ‌హ‌బూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్క‌లు నాటాల్సిందిగా కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీక‌రించి మొక్క‌లు నాట‌డం ప‌ట్ల సూర్యాపేట ఎస్పీకి ఎంపీ సంతోష్‌కుమార్ ట్విట్ట‌ర్ వేదిక‌గా కృత‌జ్ఞ‌తలు తెలిపారు.