బుధవారం 03 జూన్ 2020
Telangana - May 14, 2020 , 19:37:19

కరోనా ఫ్రీగా మారిన సూర్యాపేట

కరోనా ఫ్రీగా మారిన సూర్యాపేట

సూర్యాపేట: కరోనా పాజిటివ్‌ కేసులు హైదరాబాద్‌ తర్వాత అత్యధిక సంఖ్యలో నమోదైన సూర్యాపేట జిల్లా పూర్తిగా కోలుకుని కరోనా ఫ్రీగా మారింది. ఏప్రిల్‌ 2న తొలి పాజిటివ్‌ నమోదు కాగా 21 రోజుల్లో వైరస్‌ సోకిన వారి సంఖ్య 83కు చేరింది. వారంతా హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఒక్కొక్కరుగా డిశ్చార్జి అయి ఇళ్లకు చేరుకున్నారు. నిన్న 70 మంది, మిగిలిన 13 మంది ఇవ్వాళ డిశ్చార్జి అయ్యారు. జిల్లా కేంద్రంలో నమోదైన తొలి కేసు నుంచి చివరి కేసు వరకు ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. సమీక్షలు నిర్వహిస్తూ, ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల్లో ధైర్యం నింపారు. అలాగే కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్‌ కూడా పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాల్లో యంత్రాంగాన్ని రంగంలోకి దింపి ప్రజలను బయటికి రాకుండా కట్టడి చేయడంతో తొందరగా కరోనా ఫ్రీగా మారింపోయింది. 


logo