మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 17:17:03

వాసాలమర్రిలో అధికారుల ఇంటింటి సర్వే

వాసాలమర్రిలో అధికారుల ఇంటింటి సర్వే

యాదాద్రి భువనగిరి : సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకున్న తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామంలో శుక్రవారం వ్యవసాయశాఖ అధికారులు గ్రామంలో ఇంటింటా సర్వే నిర్వహించారు. గ్రామంలోని 10వార్డుల్లో అధికారులు 10బృందాలుగా ఏర్పడి ఇంటింటా తిరుగుతూ.. రైతుల వద్ద ఉన్న వ్యవసాయ పనిముట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సేకరించిన వివరాలను కలెక్టర్‌ అనితారామచంద్రన్‌కు అందజేయనున్నట్లు ఏవో దుర్గేశ్వరి తెలిపారు. 

అదే విధంగా గ్రామంలో గత ఐదు రోజులుగా గ్రామ భౌగోళిక సర్వే కొనసాగుతుంది. ఈ సర్వేలో గ్రామ భౌగోళిక స్వరూపం ఇండ్ల వైశాల్యం చెట్లు, స్తంభాలు, పాఠశాలలు, ఆలయాలు తదితర పూర్తి వివరాలను సర్వే చేసి బ్లూ ప్రింట్‌ తీయనున్నారు. వాసాలమర్రిని దత్తత తీసుకొని ఎర్రవల్లిలా అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారులు సర్వే పనులను పకడ్బందీగా చేపడుతున్నారు.