బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 10, 2020 , 17:23:49

హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలతో నిఘా

హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలతో నిఘా

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా గుర్తించామని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. సద్దల గుండు, రామయ్య బౌలి, పాశాబ్‌ గుట్ట, బీకే రెడ్డి కాలనీ, నలంద ఆటోస్టాండ్‌, కౌరంపేట ఏరియాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించామని, ఈ ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ఉండే వ్యక్తులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ ప్రాంత ప్రజలకు మొబైల్‌ రైతు బజార్‌ ద్వారా ఇంటి వద్దనే కూరగాయలను అందిస్తామన్నారు. నిత్యావసర సరుకుల విషయంలో కాల్‌సెంటర్‌కి ఫోన్‌ చేస్తే వారే ఇంటికి పంపిస్తారని తెలిపారు. జిల్లాలో 4114 మందిన హోం క్వారంటైన్‌లో ఉంచగా, ప్రస్తుతం వారిలో 456 మంది మినహా మిగతా వారి గడువు ముగిసిందన్నారు. మరో 14 రోజులు అయితే మిగతా వారి హోం క్వారంటైన్‌ గడువు ముగుస్తుందన్నారు మంత్రి.


logo