బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 26, 2020 , 02:05:05

భావితరాలకు సుర‘వరం’

భావితరాలకు సుర‘వరం’

వనపర్తి: వర్తమానానికి, భవిష్యత్‌తరాలకు సురవరం ప్రతాపరెడ్డి గొప్పవరమని, ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సురవరం ప్రతాప్‌రెడ్డి 67వ వర్ధంతి సందర్భంగా మంగళవారం వనపర్తిలో ఆయన విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం, జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.


logo