e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home Top Slides చరాస్తులు, నగదు పంచండి

చరాస్తులు, నగదు పంచండి

  • తెలుగు అకాడమీ ఆస్తుల పంపకంపై తెలంగాణ, ఏపీకి సుప్రీంకోర్టు సూచన
  • చరాస్తులు పంచుకున్నాం 2 వారాల్లో నిధుల బదిలీ
  • సుప్రీం ధర్మాసనానికి తెలంగాణ నివేదన

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 14 (నమస్తే తెలంగాణ): తెలుగు అకాడమీకి చెందిన చరాస్తులు, బ్యాంకుల్లో ఉన్న నగదు పం పిణీ అంశాలను పరిష్కరించుకోవాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది. చరాస్తులతో పాటు, స్థిరాస్తులను సైతం పంచాలని ఏపీ సర్కారు డిమాండ్‌ చేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ముందుగా అకాడమీకి సంబంధించిన చరాస్తుల పంపకాలు, బ్యాంకుల్లో ఉన్న నిధుల బదిలీ అంశాలను పరిష్కరించుకోవాలని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. స్థిర, చరాస్తుల పంపకాలపై ఇప్పటివరకు అనుసరించిన విధానాన్ని తెలంగాణ సర్కారు ధర్మాసనానికి నివేదించింది. బ్యాంకుల్లో ఉన్న నిధులను ఏపీకి బదిలీచేస్తామని వెల్లడించింది. మిగిలిన విషయాలు తదుపరి విచారణలో పరిశీలించనున్నట్లు ధర్మాసనం తెలిపింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana