బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 16:37:17

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర : ఎమ్మెల్యే కిషోర్‌ కుమార్‌

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర : ఎమ్మెల్యే కిషోర్‌ కుమార్‌

యాదాద్రి భువనగిరి : మోత్కూరులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం, మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే డా. గాదరి కిషోర్‌ కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం వరికి క్వింటాల్ కు మద్దతు ధర రూ.1888ని ర్ణయించడమే కాకుండా, రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని తెలిపారు.

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలి. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వనం స్వాతి, వైస్ చైర్మన్ కొణతం యాకూబ్ రెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ కొండ సోంమల్లు,వైస్ ఎంపీపీ బుశిపాక లక్ష్మి, మున్సిపాలిటీ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డి తదితరులు పాల్గొన్నారు.