బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 02:26:52

అనాథలకు అండగా..

అనాథలకు అండగా..

  • ఇంటి నిర్మాణానికి గతంలోనే మంత్రి హామీ
  • భూమి పూజ చేసిన కొప్పుల ఈశ్వర్‌

ధర్మపురి: తల్లిదండ్రులు మరణించడంతో అనాథలుగా మారి.. సొంత ఇల్లు కూడాలేని అన్నాచెల్లెళ్ల దీనస్థితిని చూసిన ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చలించారు. ఐదు నెలల క్రితం వారిని పరామర్శించిన సందర్భంలో సొంత ఖర్చుతో ఇల్లు కట్టిస్తానని మాటిచ్చారు. ఆ మేరకు మంత్రి కొప్పుల గురువారం ఇంటి నిర్మాణానికి భూమి పూజచేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్‌కు చెందిన దేవయ్య-పద్మ దంపతులు. వీరికి కొడుకు శ్రీకాంత్‌, కూతురు శిరీష ఉన్నారు. వీరు డిగ్రీ వరకు చదివారు. తల్లి రెండేండ్ల క్రితం, తండ్రి ఏడాది క్రితం అనారోగ్యంతో మరణించడంతో అన్నాచెల్లెళ్లు అనాథలుగా మిగిలారు. ఐదు నెలల క్రితం మంత్రి ఇచ్చిన మాట ప్రకారం.. తిమ్మాపూర్‌లోని 151గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించగా ఎల్‌ఎం కొప్పుల ట్రస్ట్‌ నిధులతో గురువారం ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. 


logo