గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 13, 2020 , 03:25:48

విభజన ‘ధర్మ’విరుద్ధం!

విభజన ‘ధర్మ’విరుద్ధం!
  • మళ్లీ మొదటికి విద్యుత్‌ ఉద్యోగుల విభజన
  • జస్టిస్‌ ధర్మాధికారి ఉత్తర్వులపై విద్యుత్‌ సంఘాల ఆగ్రహం
  • 1,157 మంది తిరిగి తెలంగాణకే కేటాయింపు
  • మార్గదర్శకాలకు విరుద్ధంగా అనుబంధ ఉత్తర్వులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విద్యుత్‌ ఉద్యోగుల విభజనలో తిరిగి జరుగుతున్నదని తెలంగాణ విద్యుత్‌ సంస్థల ఉద్యోగులు, కార్మికులు మండిపడుతున్నారు. జస్టిస్‌ ధర్మాధికారి బుధవారం ఇచ్చి న అనుబంధ ఉత్తర్వులు ధర్మవిరుద్ధమంటు న్నారు. జస్టిస్‌ ధర్మాధికారి గత డిసెంబర్‌ 26న ఇచ్చిన తుది ఉత్తర్వుల్లో 655 మందిని ఏపీకి, 502 మందిని తెలంగాణకు కేటాయించారు. తుది ఉత్తర్వులకు బుధవారం అనుబంధ ఉత్తర్వులు జారీచేశారు. ఏపీకి కేటాయించినవారిలో  71 మందిని వివిధ కారణాలతో తెలంగాణకు కేటాయించారు. మిగిలిన 584 మందిని ఏపీ తీసుకోవాలని చెప్తూనే.. అదే సంఖ్యలో (584) ఏపీ ఉద్యోగులను తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 1,157 మందిని మళ్లీ తెలంగాణకే పంపించడాన్ని తెలంగాణవాదులు ఖండిస్తున్నారు. అవసరమైతే మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామంటున్నారు.


ఆదినుంచి ఏపీ పేచీ

ఉద్యోగుల విభజనను ఏపీ ఉన్నతాధికారులు మొదటి నుంచి అడ్డుకుంటూనే ఉన్నారు. ఏపీ స్థానికత కలిగిన 1,175 మందిని తెలంగాణ విద్యుత్‌ సంస్థల నుంచి రిలీవ్‌ చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుతో 2018 నవంబర్‌లో ఏర్పాటైన జస్టిస్‌ ధర్మాధికారి  కమిటీ  ఉద్యోగుల విభజనను చేపట్టింది. ఇరు రాష్ర్టాల విద్యుత్‌ సంస్థల ఉన్నతాధికారులతో ఏర్పాటైన సబ్‌ కమిటీ అంగీకారంతో 2019 డిసెంబర్‌ 26న తుది ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ రిలీవ్‌ చేసిన మొత్తం ఉద్యోగుల్లో ఏపీకి ఆప్షన్‌ ఇచ్చిన 655 మందిని ఏపీకి కేటాయించింది. 502 మందిని తెలంగాణకు అలాట్‌చేసింది. సమస్యను పరిష్కరించుకోవాలనే సదుద్దేశంతో తెలంగాణ ఉన్నతాధికారులు అందుకు అంగీకరించారు. దీని పై కొర్రీలు పెట్టిన ఏపీ మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లగా.. జస్టిస్‌ ధర్మాధికారి వద్దకే వెళ్లాలని, మళ్లీ చర్చించి నిర్ణయం తీసుకోవాలని తేల్చిచెప్పింది. సమస్య పరిష్కారానికి పలు అంశాల్లో తెలంగాణ విద్యుత్‌ సంస్థలు మానవీయ దృక్పథంతో వ్యవహరించాయి. అయిన్న ప్పటికీ అనుబంధ ఉత్తర్వుల పేరుతో మరో 584 మందిని ఏపీ నుంచి తెలంగాణకు కేటాయించడంపై కార్మికులు మండిపడుతున్నారు. 

నివేదికపై విద్యుత్‌సంఘాల మండిపాటు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జస్టిస్‌ ధర్మాధికారి  కమిటీ తుది నివేదిక ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, దీనిని తిరస్కరిస్తున్నట్టు తెలంగాణ విద్యుత్‌ ఇంజినీర్ల అసోసియేషన్‌ (టీఈఈఏ), తెలంగాణ పవర్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ (టీఎస్‌పీఈఏ), విద్యుత్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (వీఏవోఏటీ) ప్రకటించాయి. ఆయా సంఘాలు గురువారం హైదరాబాద్‌లో వేర్వేరుగా సమావేశమై కమిటీ నివేదికపై చర్చించాయి. ఆయా సమావేశాల్లో టీఈఈఏ సంఘం అధ్యక్షుడు ఎన్‌ శివాజీ, ప్రధాన కార్యదర్శి రామేశ్వరయ్య, టీఎస్‌పీఈఏ అధ్యక్ష కార్యదర్శులు పీ రత్నాకర్‌రావు, సదానందం, వీఏవోఏటీ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ అంజయ్య, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ అధ్యక్షుడు డీ వీరాస్వామి, కార్యదర్శి పరమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>