సోమవారం 01 జూన్ 2020
Telangana - May 06, 2020 , 21:52:27

వలస కూలీలను చితకబాదిన సూపర్‌వైజర్‌

వలస కూలీలను చితకబాదిన సూపర్‌వైజర్‌

పరిగి : చేసిన కష్టానికి కూలీ అడిగినందుకు వలస కూలీలపై ఓ కంపెనీ సూపర్‌వైజర్‌ దాష్టికాన్ని ప్రదర్శించాడు. వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం రంగాపూర్‌ సమీపంలో పవన్‌ ైప్లెవుడ్‌ ఫ్యాక్టరీలో బీహార్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపులతో తమ స్వంత రాష్ర్టాలకు వెళ్లేందుకు కూలీలు సమాయత్తమయ్యారు. 21 మంది కూలీలు కలిసి సూపర్‌వైజర్‌ శివంను ఆశ్రయించి తమ రాష్ర్టాలకు వెళ్తున్నట్లుగా చెప్పి కూలీ డబ్బులు ఇప్పించాల్సిందిగా అడిగారు. కాగా వీరికి కూలీ డబ్బులు ఇవ్వకపోగా సూపర్‌వైజర్‌ శివం చితకబాదాడు. శివం విచక్షణారహితంగా చేసిన దాడిలో నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఇన్నాళ్లు చేసిన పనికి డబ్బులు అడిగితే ఇదేమి పరిస్థితి అంటూ కూలీలు వాపోయారు. సమాచారం అందుకున్న సీఐ లక్ష్మారెడ్డి ఫ్యాక్టరీని సందర్శించి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. logo