బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 02, 2020 , 06:50:30

ప్రాపర్టీ షో గ్రీవెన్స్‌కు విశేష స్పందన: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

ప్రాపర్టీ షో గ్రీవెన్స్‌కు విశేష స్పందన:  జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

హైదరాబాద్‌ : ప్రాపర్టీ ట్యాక్స్‌ సమస్యలను పరిష్కరించుటకు ఆదివారాల్లో నిర్వహిస్తున్న ప్రాపర్టీ ట్యాక్స్‌ పరిష్కారం గ్రీవెన్స్‌కు మంచి స్పందన లభిస్తున్నదని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌.లోకేశ్‌కుమార్‌ తెలిపారు. గ్రీవెన్స్‌లలో ఇప్పటివరకు వచ్చిన 782 ఫిర్యాదులలో 127 పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఆదివారం అందిన 348 సమస్యల్లో 23 సమస్యలు వెంటనే పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. మిగిలిన వాటి పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పరిశీలించి, పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ అధికారులను ఆదేశించారు.


logo
>>>>>>