గురువారం 21 జనవరి 2021
Telangana - Jan 08, 2021 , 11:09:31

రాష్ర్ట తొలి మ‌హిళా క‌మిష‌న్ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

రాష్ర్ట తొలి మ‌హిళా క‌మిష‌న్ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

హైదరాబాద్ : రాష్ట్ర తొలి మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి బాధ్య‌త‌లు శుక్ర‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. మ‌హిళా క‌మిష‌న్ స‌భ్యులుగా షాహీన్ ఆఫ్రోజ్‌, గ‌ద్ద‌ల ప‌ద్మ‌, కుమ్ర ఈశ్వ‌రీబాయి, సూదం ల‌క్ష్మి, ఉమాదేవి యాద‌వ్‌, రేవ‌తీరావు బాధ‌త్య‌లు స్వీక‌రించారు. బుద్ధ‌భ‌వ‌న్ క‌మిష‌న్ కార్యాల‌యంలో బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. చైర్‌ప‌ర్స‌న్ సునీతా ల‌క్ష్మారెడ్డితో పాటు మిగ‌తా స‌భ్యుల‌కు మంత్రి కేటీఆర్ పుష్ప‌గుచ్ఛం అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌, సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజునుంచి ఐదేండ్లపాటు పదవిలో కొనసాగ‌నున్నారు. 

సునీతా ల‌క్ష్మారెడ్డి నేప‌థ్యం..

సునీత భర్త లక్ష్మారెడ్డి ఉమ్మడి మెదక్‌ జిల్లా గోమారం సర్పంచ్‌తోపాటు శివ్వంపేట జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. మెదక్‌ జిల్లా రైతుసంక్షేమం సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. సునీత మామ రామచంద్రారెడ్డి 25 ఏండ్లపాటు సర్పంచ్‌గా, శివ్వంపేటకు ఎంపీపీగా పనిచేశారు. వీరి వారసురాలిగా సునీత 1999లో రాజకీయరంగ ప్రవేశం చేశారు. నర్సాపూర్‌ నియోజకవర్గం నుంచి 1999లో తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే నియోజకవర్గంనుంచి మూడు పర్యాయాలు వరుసగా విజయం సాధించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మృదుస్వభావి, సహనశీలిగా పేరుగాంచిన సునీత 2019లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 


గ‌ద్ద‌ల ప‌ద్మ‌

కమిషన్‌లో సభ్యురాలిగా నియమితురాలైన గద్దల పద్మ ఉమ్మడి వరంగల్‌ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఆమె అంగన్‌వాడీ టీచర్‌గా.. అంతకుముందు బీడీ కార్మికురాలిగా కూడా పనిచేశారు. భర్త నర్సింగరావు వరంగల్‌ జిల్లా నర్మెట్ట మండలంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు. భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఊహించని అవకాశం చేజిక్కించుకున్నారు. 

రేవతిరావు

పెద్దపల్లికి చెందిన రేవతిరావు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేశారు. 

సూదం ల‌క్ష్మి

నిజామాబాద్‌ పట్టణానికి చెందిన సూదం లక్ష్మి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేశారు. ప్రజామోదంతో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. మహిళా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారు. 

కుమ్రం ఈశ్వ‌రీబాయి

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లికి చెందిన కుమ్ర ఈశ్వరీబాయిది వ్యవసాయ కుటుంబం. 2014 నుంచి 2019 ఎంపీపీగా పనిచేశారు. అదేసమయంలో ఐటీడీఏ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. టీఆర్‌ఎస్‌ మహిళావిభాగం కార్యదర్శిగా కూడా పనిచేశారు. జిల్లాలో జరిగిన ఉద్యమ పోరాటాల్లో కీలకభూమిక పోషించారు. ఈమె భర్త రాజేశ్వర్‌ ఉపాధ్యాయుడు. 

షాహీన్ అఫ్రోజ్‌

హైదరాబాద్‌ నగరానికి చెందిన షాహీన్‌ అఫ్రోజ్‌ మలక్‌పేట మార్కెట్‌ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. టీఆర్‌ఎస్‌లో మైనారిటీ విభాగం నాయకురాలిగా కొనసాగుతున్నారు. 

కొమ్ము ఉమాదేవి

కొమ్ము ఉమాదేవిది మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఖాజీపల్లి. టీఆర్‌ఎస్‌లో క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తున్నారు.


logo