శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 23, 2020 , 18:00:56

పొలంలో దిగి నాటేసిన ప్రభుత్వ విప్‌ సునీతామహేందర్‌రెడ్డి

పొలంలో దిగి నాటేసిన ప్రభుత్వ విప్‌ సునీతామహేందర్‌రెడ్డి

యాదాద్రి భువనగిరి : ప్రపంచ రైతు దినోత్సవం సందర్భంగా యాదగిరిగుట్ట మండలంలోని గౌరాయిపల్లి గ్రామంలో పొలంలో దిగి ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే సునీతామహేందర్‌రెడ్డి నాటు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మారుమూల గ్రామాల్లోని రైతులకు అండగా నిలుస్తున్న వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను ఎత్తివేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు పూర్తిగా కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ముకాసేలా ఉన్నాయని దుయ్యబట్టారు. దేశ రైతులంతా మోదీ ప్రవేశపెటిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తుంటే కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. జై శ్రీరాం కాదు, జై కిసాన్‌ అనే నినాదాన్ని బీజేపీ ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలన్నారు.


రైతు ఏడ్చిన దేశాలు మనుగడ సాధించలేదన్నారు. రైతులను విచ్చిన్నం చేసే పనిలో బీజేపీ ప్రభుత్వం ఉందని, ఇది ఏ మాత్రం మంచిదికాదని ఆవేదన చెందారు. కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రవీందర్‌గౌడ్‌, రైతు బంధు సమితి కో ఆర్డినేటర్‌ జిన్నా మాధవరెడ్డి, సర్పంచ్‌ సిరికొండ సత్యానారాయణ తదితరులు పాల్గొన్నారు. 


logo