బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 15, 2020 , 20:52:18

సండే సరదాగా..!

సండే సరదాగా..!

సిద్దిపేట : నిత్యం పనుల్లో బిజీగా ఉండే మంత్రి హరీశ్‌రావు ఆదివారం సాయంత్రం సిద్దిపేటలోని పర్యటనలు, కార్యక్రమాల తర్వాత మినీ ట్యాంక్ బండ్‌పై కాసేపు సరదాగా గడిపారు. బండ్‌పై వచ్చిన పర్యాటకులతో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. మెదక్ పోలీస్‌ వర్సెస్‌ సిద్ధిపేట పోలీస్ డే అండ్ నైట్‌ టీ20 క్రికెట్ మ్యాచ్‌ జరగ్గా.. హాజరయ్యారు. టాస్‌ వేసి మ్యాచ్ ప్రారంభించారు. పోటీలో పాల్గొన్న పోలీస్‌ సిబ్బందిని పరిచయం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాసేపు సరదాగా బ్యాటింగ్‌ చేశారు. మరో ఓవర్‌ బౌలింగ్‌ చేశారు. సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ బౌలింగ్ చేయగా మంత్రి హరీశ్ రావు బ్యాటింగ్‌తో వినూత్న షాట్లు కొడుతూ అలరించారు. ఆ తర్వాత మంత్రి బౌలింగ్ చేయగా పోలీస్‌ కమిషనర్ జోయల్ డేవిస్ బ్యాటింగ్ చేశారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.