గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 06:07:27

ఆదివారం 8 మార్చి 2020... మీ రాశిఫలాలు

ఆదివారం  8 మార్చి 2020... మీ రాశిఫలాలు

మేషరాశి :  ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చేసే పనులకు, వృత్తి వ్యవహారాలకు ఆటంకాలు ఏర్పడుతాయి. సహనాన్ని కోల్పోకుండా మీ పనులు పూర్తి చేయటం మంచిది. నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు బాధించే అవకాశముంటుంది.

వృషభం : ఈ రోజు ఆర్థికంగా చాలా అనుకూలంచే దినం. రావలసిన బకాయిలు రావటమే కాకుండా మీరు తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అనుకోని డబ్బు కానీ, చేపట్టిన పనిలో విజయం కానీ వరిస్తుంది. ఉద్యోగం విషయంలో శుభవార్త వింటారు. ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తి పరంగా మంచి గుర్తింపును పొందుతారు. 

మిథునం :  ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేతులు, చెవులు, తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశముంటుంది. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపవలసి రావటం కానీ, ఏదైనా అడ్డంకి ఎదురవటం కానీ జరుగవచ్చు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. 

కర్కాటకం : ఈరోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామి కొరకు, కుటుంబ సభ్యుల కొరకు డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. 

సింహం :  బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశముంటుంది.

కన్య :   మీరు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోద కార్యక్రమాల్లో మునిగి తేలుతారు.

తుల :  మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే దానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీరు ప్రారంభించే పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఆటంకాలు తొలగిపోతాయి.

వృశ్చికం :  ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తుల కారణంగా లేదా నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచండి. వారి కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశముంటుంది. పెట్టుబడులకు   అనువైన రోజు కాదు.

ధనుస్సు :  ఈ రోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. శ్వాస సంబంధ సమస్యలు కానీ, జీర్ణకోశ సంబంధ సమస్యలు కానీ వచ్చే అవకాశముంటుంది. అలాగే కీళ్లు, ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. కొత్త పనులకు అనుకూలమైన రోజు కాదు.

మకరం : ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. రోజంతా ఆనందంగా ఉంటారు. కొత్త పనులు చేపట్టడానికి అనుకూల సమయం.

కుంభం : ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. స్నేహితులతో గడపటానికి, విందు, వినోద కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కొత్తగా వాహనం కొనటం కానీ, పోయిన వాహనం దొరకటం కానీ జరుగుతుంది. అనుకోని ప్రయాణం చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.  పెట్టుబడులు లాభిస్తాయి.

మీనం :  ఈ రోజు ఆరోగ్యం విషయంలో, ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. అనుకోని ధన నష్టం కానీ, ఆరోగ్య సమస్యలు రావటం కానీ జరుగవచ్చు. పెట్టుబడులకు, ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది. మీ సంతానం విద్యలో మంచి అభివృద్ధి సాధిస్తారు. వృత్తి వ్యవహారాల్లో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.


logo
>>>>>>