గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 26, 2020 , 17:21:43

సుందర్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి

సుందర్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి

సూర్యాపేట : శ్రీశైలం పవర్ హౌస్ అగ్రి ప్రమాదంలో అమరుడైన అసిస్టెంట్ ఇంజినీర్ డి.సుందర్ నాయక్ కుటుంబ సభ్యులను విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శించారు. సుందర్ నాయక్ స్వగ్రామమైన చెవ్వెంల మండలం  జగన్ నాయక్ తండాలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. సుందర్ నాయక్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అధైర్య పడొద్దు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.logo