సోమవారం 06 జూలై 2020
Telangana - May 30, 2020 , 03:58:17

నేడు వడగాడ్పులు.. వానలు

నేడు వడగాడ్పులు.. వానలు

హైదరాబాద్ : రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తున్నది. ఓ వైపు ఎండలు మండుతూనే అక్కడక్కడ వానలు కూడా కురుస్తున్నాయి. శనివారం రాష్ట్రంలోని పలుచోట్ల చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని జిల్లాల్లో వడగాడ్పులు వీయొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు మరాఠ్వాడ, తెలంగాణ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తువద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఈ ప్రభావంతో శనివారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని చెప్పారు.


logo