శనివారం 30 మే 2020
Telangana - May 22, 2020 , 15:29:32

రాష్ట్రంలో దంచికొడుతున్న ఎండలు

రాష్ట్రంలో దంచికొడుతున్న ఎండలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో 45 నుంచి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాలు నిప్పుల కుంపటిలా మారాయి. భానుడి భగభగలకు ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను టీఎస్‌డీపీఎస్‌ వెల్లడించింది. 

పెద్దపల్లి జిల్లా మంథనిలో 46.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, జగిత్యాల జిల్లా ధర్మపురిలో 46.5 డిగ్రీలు, ఖమ్మం జిల్లా ఉంకూరులో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటలకే ఎండలు భగభగమంటున్నాయి. పగటిపూటనే ఉక్కపోత తీవ్రంగా ఉంది. చిన్నపిల్లలు, వృద్ధులు ఎండ వేడిమి తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 

ఉత్తర ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న వేడిగాలులు, పొడి వాతావరణం కారణంగా రాగల మూడు రోజుల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించిన విషయం విదితమే. రాష్ట్రంలో గురువారం వడదెబ్బతో నలుగురు మృతి చెందారు. 


logo