హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): కొవిడ్ దృష్ట్యా రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలకు బుధవారం నుంచి ఈ నెల 31 వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కాలేజీలతోపాటు ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో సెకండ్ షిఫ్ట్ కింద నడుస్తున్న ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలన్నింటికి ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపారు.
9న క్యాట్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్
కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ నెల 9న టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్టు టైమ్ సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటలకు, తిరిగి సాయంత్రం 6 గంటలకు రెండు సెషన్లల్లో ఎగ్జామ్ ఉంటుందని పేర్కొన్నది. ఆసక్తిగలవారు www.time4education.com వెబ్సైట్ ద్వారా పేర్లను నమోదుచేసుకోవచ్చని వెల్లడించింది.