శనివారం 04 జూలై 2020
Telangana - May 25, 2020 , 13:59:04

రాష్ట్రంలో మండుతున్న ఎండలు

రాష్ట్రంలో మండుతున్న ఎండలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో నాలుగైదు రోజులు ఎండ త్రీవత ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. గత నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీలు దాటుతున్నాయని పేర్కొంది. ఇవాళ పలు జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకావశం ఉన్నదని తెలిపింది. రాజస్థాన్‌ నుంచి విదర్భ మీదుగా వేడిగాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎండలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అందువల్ల ప్రజలు మధ్యాహ్నం తర్వాత బయటకి రావద్దని వాతావరణ శాఖ సూచించింది. రాష్ట్రంలో అత్యధికంగా నిన్న ఆదిలాబాద్‌ జిల్లాలో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


logo