హైదరాబాద్ : తెలంగాణలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీలకు ఈ నెల 5వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని తెలిపింది. సవరించిన అకడమిక్ షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు.