హైదరాబాద్ : విద్యాశాఖ కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియాకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ శుక్రవారం పదవీ విరమణ పొందారు. దీంతో పీఆర్ అండ్ ఆర్డీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.