మంగళవారం 02 మార్చి 2021
Telangana - Dec 18, 2020 , 01:28:17

వేరు కాపురం పెడతానన్నాడనీ..

వేరు కాపురం పెడతానన్నాడనీ..

  • అల్లుడిని మందలించిన అత్త  
  • మనస్తాపంతో నవ దంపతుల ఆత్మహత్యాయత్నం
  • భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం 

కోటగిరి: వేరు కాపురం ఆలోచన ఆ నవదంపతుల ప్రాణం మీదికి తెచ్చింది. ప్రేమించుకొని పెండ్లి చేసుకున్న జంట.. ఆశ్రయమిచ్చిన వధు వు తల్లే వేధిస్తుండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స పొందుతూ భర్త మృతిచెందగా.. భార్య పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా కోటగిరిలో చోటుచేసుకున్నది. కోటగిరిలోని మాలివాడకు చెందిన గంగాధర్‌ కుమారుడు సాయిప్రణీత్‌(22) బోధన్‌లోని ఓ సూపర్‌ మార్కెట్‌లో పనిచేసేవాడు. మాలివాడలో ఉండే విజయతో సాయిప్రణీత్‌కు పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. గత నెల 21న ఓ గుడిలో వివాహం చేసుకొన్నారు. అనంతరం కొత్త జంట విజయ ఇంటికి చేరుకున్నారు. కొన్ని రోజులపాటు అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో వేరుగా ఉండాలని సాయిప్రణీత్‌-విజయ భావించారు. అందుకు విజయ తల్లి సావిత్రి నిరాకరించడంతోపాటు వేధించడం ప్రారంభించింది. ఆమె వేధింపులు తాళలేక దంపతులు మంగళవారం క్రిమిసంహారక మందు తాగారు. గమనించిన స్థానికులు నిజామాబాద్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ సాయిప్రణీత్‌ గురువారం మృతిచెందాడు. విజయ పరిస్థితి విషమంగానే ఉన్నది. 

VIDEOS

logo