శనివారం 11 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 12:58:18

జగిత్యాలలో రవాణాశాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు

జగిత్యాలలో రవాణాశాఖ  అధికారుల ఆకస్మిక తనిఖీలు

జగిత్యాల : జగిత్యాల పట్టణంలో మోటార్ డ్రైవింగ్ స్కూళ్లలో రవాణాశాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పది డ్రైవింగ్ స్కూళ్లలో తనిఖీలు చేయగా.. పట్టణంలోని ఎనిమిది డ్రైవింగ్ స్కూళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న అక్షర మోటార్ డ్రైవింగ్, జై దుర్గ మోటార్ డ్రైవింగ్ స్కూళ్లను సీజ్ చేసినట్లు జిల్లా రవాణాశాఖ అధికారి అజ్మీరా శ్యామ్ నాయక్ తెలిపారు. అందరూ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎంవీఐ అభిలాష, సిబ్బంది పాల్గొన్నారు.


logo