మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 13:37:22

నేను బాగానే ఉన్నాను : సుద్దాల అశోక్‌ తేజ

నేను బాగానే ఉన్నాను : సుద్దాల అశోక్‌ తేజ

సోషల్‌ మీడియాలో మంచికన్నా చెడే చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నది.  ఎంతో మంది సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు ఈ ఫేక్‌ న్యూస్‌ భారిన పడుతుంటారు. మాకేం కాలేదు.. మేం బాగానే ఉన్నామని  క్లారిటీ ఇచ్చుకోవాల్సి వస్తున్నది. కవి, గాయకుడు సుద్దాల అశోక్‌ తేజ కూడా ఈ కోవలోకే వస్తున్నారు. ఆయనకు కరోనా సోకిందని, ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని ప్రచారం జరిగింది. దీనికి ఆయనే స్వయంగా క్లారిటీ  ఇచ్చారు. తనకు ఏం కాలేదని, ఆరోగ్యంగానే ఉన్నానని అశోక్‌ తేజ ఒక వీడియో మెస్సేజ్‌ విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడారో మీరూ చూడండి..logo