శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 02:15:16

బ్రహ్మోస్‌ క్షిపణి పరీక్ష సక్సెస్‌

బ్రహ్మోస్‌ క్షిపణి పరీక్ష సక్సెస్‌

న్యూఢిల్లీ: భారతీయ వాయుసేన (ఐఏఎఫ్‌) గగనతలం నుంచి బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. పంజాబ్‌లోని ఐఏఎఫ్‌ స్థావరం నుంచి దూసుకెళ్లిన సుఖోయ్‌ యుద్ధ విమానం.. బంగాళాఖాతంలో మునిగిపోతున్న ఓడను కచ్చితత్వంతో ఢీకొట్టిందని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు భారతీయ నౌకాదళం బంగాళాఖాతంలో యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ కోరా నుంచి నౌక విధ్వంసక క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. యుద్ధ సన్నద్ధతలో భాగంగా నిర్వహిస్తున్న మిలిటరీ విన్యాసాల్లో భాగంగా ఈ ప్రయోగం జరిపామని నౌకాదళం పేర్కొంది.