గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 30, 2020 , 18:04:32

సుభాష్ రెడ్డి దాతృత్వం రాష్ట్రానికే ఆదర్శం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

సుభాష్ రెడ్డి దాతృత్వం రాష్ట్రానికే ఆదర్శం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

కామారెడ్డి ‌ : తాను చదివిన పాఠశాల పునర్నిర్మాణం కోసం ఆరు కోట్ల రూపాయల సొంత నిధులతో సుభాష్‌ రెడ్డి నిర్మించడం రాష్ట్రానికే ఆదర్శమని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బీబీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పునర్నిర్మాణ కార్యక్రమానికి మంత్రి, ప్రభుత్వ విప్ కామారెడ్డి శాసన సభ్యుడు గంప గోవర్ధన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. సంపాదనలో అధిక భాగం ప్రజా శ్రేయస్సు కోసం వినియోగిస్తున్న జనగామ సుభాష్ రెడ్డి, ఆయన  భార్య రజనీ రెడ్డిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని తమ తమ గ్రామాల్లో అభివృద్ధిలో భాగస్తులవ్వాలని పిలుపునిచ్చారు. ఇంత మంచి పనికి రజనీ ప్రోత్సహించడం మహిళలకు ఎంతో స్ఫూర్తి దాయకం అని సబితా ఇంద్రారెడ్డి ప్రశంసించారు. ప్రతి పనిలో స్త్రీ పాత్ర ఉంటుందని వివరించారు. ప్రభుత్వం చేసే పనుల్లో ఇలా ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంటేనే సమాజం పురోభివృద్ధి సాధిస్తుందన్నారు. చదివిన పాఠశాలను, సొంత గ్రామాన్ని మరవకుండా అందరూ ముందుకు రావాలని మంత్రి కోరారు.