శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Aug 29, 2020 , 13:19:05

క్రీడా పాలసీ కోసం సబ్‌ కమిటీ : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

క్రీడా పాలసీ కోసం సబ్‌ కమిటీ : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌ : రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్రీడాపాలసీ కోసం క్యాబినెట్‌ సబ్ ‌కమిటీ వేశారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. జాతీయ క్రీడాదినోత్సవం హాకీ స్టేడియంలో నిర్వహించగా.. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో క్రీడా పాలసీ కోసం సీఎం క్యాబినెట్‌ సబ్‌ కమిటీ వేశారని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 50 చోట్ల స్టేడియాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి ప్రకటించారు. అలాగే ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. క్రీడాకారులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా తొలిసారిగా వర్చువల్‌ విధానంలో క్రీడాకారులకు పురస్కారాలు ప్రదానం చేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో వర్చువల్‌ విధానంలో పలు క్రీడల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ ఏడాది జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా కేంద్రం 74 మందికి అవార్డులను ప్రకటించింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo