శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 25, 2020 , 14:57:20

హైదరాబాద్‌లో హాస్టల్స్‌ను ఖాళీ చేయిస్తున్న నిర్వాహకులు

హైదరాబాద్‌లో హాస్టల్స్‌ను ఖాళీ చేయిస్తున్న నిర్వాహకులు

హైదరాబాద్‌ : నగరంలోని పలు ప్రాంతాల్లో హాస్టల్స్‌ నిర్వాహకులు విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నగరంలోని పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్‌, బాలానగర్‌ తదితర ప్రాంతాల్లోని హాస్టల్స్‌ నిర్వాహకులు విద్యార్థులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ఎటూ దిక్కుతోచని విద్యార్థులు ఆయా ప్రాంతాల్లోని స్థానిక పోలీస్‌ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. పంజాగుట్ట, రాయదుర్గం, ఎస్‌ఆర్‌నగర్‌, బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్లకు విద్యార్థులు భారీగా చేరుకున్నారు. స్వస్థలాలకు వెళ్లేందుకు పోలీసుల అనుమతి తీసుకుంటున్నారు. బాలానగర్‌ ఏసీపీ కార్యాలయంలో స్వస్థలాలకు వెళ్లేందుకు విద్యార్థులకు పోలీసులు పాసులు జారీ చేస్తున్నారు.


logo