సోమవారం 01 జూన్ 2020
Telangana - May 08, 2020 , 01:14:18

కవిత చొరవతో స్వస్థలానికి విద్యార్థులు

కవిత చొరవతో స్వస్థలానికి విద్యార్థులు

నందిపేట్‌ రూరల్‌: లాక్‌డౌన్‌ కారణంగా బెంగళూరులో చిక్కుకుపోయిన ఐదుగురు రాష్ట్ర విద్యార్థులు నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవిత చొరవతో ఇంటికి చేరారు. నిజామాబాద్‌ జిల్లా వెల్మల్‌కు చెందిన అల్లకొండ శ్రీనివాస్‌, నల్లగొండ జిల్లాకు చెందిన సైయేందర్‌, మంచిర్యాల జిల్లాకు చెందిన సౌమిత్‌, హైదరాబాద్‌కు చెందిన హరిప్రసాద్‌, విజయ్‌ బెంగళూరులో చదువుకొంటున్నారు. లాక్‌డౌన్‌తో వీరంతా అక్కడే నిలిచిపోయారు. తమ కుమారుడిని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు సహకరించాలని నిజామాబాద్‌ జిల్లా వెల్మల్‌ విద్యార్థి శ్రీనివాస్‌ తండ్రి ఈనెల 3న మాజీ ఎంపీ కవితకు ఫోన్‌లో విజ్ఞప్తిచేశాడు. వెంటనే స్పందించిన ఆమె తన పీఏతో ఏర్పాట్లు చేయించి సొంత ఖర్చులతో కారులో బెంగళూరు నుంచి స్వస్థలాలకు తీసుకొచ్చారు. 


logo