సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 16:38:46

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి : మంత్రి నిరంజన్ రెడ్డి

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి : మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి : విద్యార్థులకు మంచి విద్యను అందించి చక్కని ఫలితాలు రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ చేపట్టినట్లు  వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో తెలంగాణ రాష్ట్రం రాకపూర్వం విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు గడిచినప్పటికీ పాఠ్యపుస్తకాలు ధర ఇచ్చి కొనుగోలు చేసినా అందుబాటులో ఉండేవి కాదన్నారు.

 టీఆర్ఎస్  ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతో పాఠ్యపుస్తకాలను సకాలంలో ముద్రించి, ఉచితంగా పంపిణీ చేస్తుందని తెలిపారు. అంతేకాక సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని  అమలు చేస్తుందన్నారు. జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిందని వెల్లడించారు.


 క్యాబినెట్ అనుమతి రావాల్సి ఉందన్నారు. రేపటి సమాజం నిర్మాతలుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోక్ నాథ్ రెడ్డి, అదనపు కలెక్టర్ డి .వేణు గోపాల్, గ్రంథాలయ సంస్థ అధ్యక్షడు లక్ష్మయ్య, డీఈవో సుశీంధర్ రావు తదితరులు ఉన్నారు.


logo